Nellore: నెల్లూరు రూరల్లో కాలువ స్థలం రక్షించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇస్కాన్ సిటీ ఏరియాలో కొన్నేళ్లుగా నలుగుతున్న ప్రధాన భూ సమస్యకు ఎట్టకేలకు తెరపడింది.
Nellore: నెల్లూరు రూరల్లో కాలువ స్థలం రక్షించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇస్కాన్ సిటి ఏరియాలో అక్రమణకు గురై,వరద ముంపుకు, మురుగునీటి సమస్యకు కారణం అవుతున్న అర కిలోమీటర్ మేర ఇరిగేషన్ ప్రధాన కాలువని ఒత్తిడిలు అధిగమించి కొత్తగా నిర్మించారు కమిషనర్ నందన్.
ఇరిగేషన్ శాఖ పట్టించుకోకున్న కూడా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహాయసహకారాలతో ఇస్కాన్ సిటి లో 100 ఎకరాల ఏరియాను, వరద నుండి కాపాడేందుకు అక్రమణలకు గురైన 300 కోట్ల విలువైన ఇరిగేషన్ కాలువని తిరిగి తవ్వి శభాష్ అనిపించుకున్నారు.
300 కోట్లకు పైగ విలువ చేసే ఇరిగేషన్ వరద కాలువను కబ్జా చేసి, లే అవుట్స్ వేయడం,ప్లాట్స్ చేసి అమ్మేసి ప్రజలను మోసం చేయడం, చేసిన ఘోరాలు కూడా ఈ కొత్త ఇరిగేషన్ కాలువ తవ్వకంతో బయటపడింది.
ఇస్కాన్ సిటి లోని C బ్లాక్ ఏరియాలో అంకణం ధర 4 లక్షలకు పైగ పలుకుతున్న ఈ రోజుల్లో 50 అడుగుల వెడల్పుతో , అర కిలోమీటర్ పోడవుతో అక్రమణకు గురైన ఇరిగేషన్ వరద కాలువను కాపాడిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని,కమిషనర్ నందన్ ని ప్రజలు అభినందిస్తున్నారు.
ఈ 300 కోట్ల విలువైన ఇరిగేషన్ వరదల కాలువ స్దలం కాపాడే ప్రయత్నంలో కార్పోరేషన్ ఎ.ఇ అచ్యుత రెడ్డి,సిబ్బంది చంద్రహాస్, రహీం, కాంట్రాక్టర్ సురేష్ లు కృషి చేశారు.




