Nellore: ప్రజా సమస్యలే పరిష్కారంగా అడుగులు.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్. ప్రతి శుక్రవారం ఉదయం 10 నుండి 12 వరకు ప్రజా సమస్యల వినతి.
Nellore: ప్రజా సమస్యలే పరిష్కారంగా అడుగులు.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రతి రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,
అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలసి ఎప్పటికపుడు సమన్వయం చేస్తున్నాం, పరిష్కారం అయ్యే ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో గుండ్లపాలెం పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ పముజుల ప్రదీప్, కో క్లస్టర్ ఇంచార్జ్ విష్ణు ప్రియ, 26వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు బూడిద పురుషోత్తం యాదవ్, 31వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు కూకటి హరి బాబు యాదవ్, టిడిపి నాయకులు ఓబుల్ రాజు , ఆకుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




