Nellore: పేదలకు సంజీవనిలా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే కోటంరెడ్డి!
Nellore: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు సంజీవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో 799 మందికి రూ.6.90 కోట్ల లబ్ధి, బాధితులకు చెక్కుల అందజేత.
Nellore: పేదలకు సంజీవనిలా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే కోటంరెడ్డి!
నెల్లూరు: నెల్లూరు రూరల్ లో 799 మందికి రూ.6 కోట్ల 90 లక్షలు లబ్ధి చేకూరిందని చెప్పారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... నెల్లూరు రూరల్ కార్యాలయంలో 12మందికి 9 లక్షల రూపాయల చెక్కులను అందించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..బాధితులను పేరుపేరునా పలకరించి ఆరోగ్యంపై ఆరా తీసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద సాయం అందించే ప్రక్రియ మొదలైందని, ఇంత ఉదారంగా గతంలో ఎప్పుడూ పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి సాయం అందలేదని చెప్పారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దమనస్సు చేసుకుని సాయం అందిస్తున్నారని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.




