Nellore: సౌత్ మోపూరులో కర్మక్రతువుల భవనం ప్రారంభం: కోటంరెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వరుస అభివృద్ధి పనుల్లో భాగంగా సౌత్ మోపూరు గ్రామంలో సరికొత్త భవనాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.
Nellore: సౌత్ మోపూరులో కర్మక్రతువుల భవనం ప్రారంభం: కోటంరెడ్డి
Nellore: నేడు సౌత్ మోపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కర్మక్రతువుల భవనాన్ని జెడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ తో కలసి ప్రారంభించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..
గత 12 ఏళ్లుగా ఎమ్మెల్యే గా ఉన్నా, ఎక్కడా తగాదాలు ప్రోత్సహించలేదని, సౌత్ మోపూరు గ్రామ ప్రజలు తగాదాలకు పోకుండా, ఒక కుటుంబ వాతావరణంలో ఉండాలని కోరారు. సౌత్ మోపూరు గ్రామంలో ఇంకా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజల సౌకర్యార్ధం సౌత్ మోపూరు గ్రామంలో కర్మక్రతువుల భవనాన్ని నిర్మించామని తెలిపారు జెడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ. పై కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మరియు సౌత్ మోపూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




