Nellore: జెన్-జీ యువత ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేస్తా: కోటంరెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ విద్యార్థులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3 గంటల పాటు ఆత్మీయంగా ముచ్చటించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 27 Aug 2026 7:05 PM IST
Nellore
X

Nellore: జెన్-జీ యువత ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేస్తా: కోటంరెడ్డి!

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ లో విద్యార్థిని విద్యార్థులతో ఆత్మీయ భేటీ కార్యక్రమంలో పాల్గొన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ విద్యార్థిని విద్యార్థులతో 3 గంటల పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ భేటీ కొనసాగింది.

యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు శ్రీధర్ రెడ్డి. నిత్యం ప్రజల్లో ఉండడం నాకు ఇష్టమని, తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షమేనని, గత 3ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ప్రజలు నన్ను ప్రజలు ఆదరించారని చెప్పారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. యువత భవిష్యత్తు కోసం నారా లోకేష్ బంగారు బాట వేస్తున్నారని, జెన్-జీ యువత అంటే తనకెంతో ఇష్టమని , వారి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ లో స్థానిక శాసనసభ్యుడుగా పనిచేస్తానని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story