Nellore: ఎలక్ట్రికల్ స్కూటీ పై రూరల్ ఎమ్మెల్యే ఇంధన పొదుపులో వినూత్న ప్రయోగం
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Nellore: ఎలక్ట్రికల్ స్కూటీ పై రూరల్ ఎమ్మెల్యే ఇంధన పొదుపులో వినూత్న ప్రయోగం
నెల్లూరు: ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనలతో ఇంధన పొదుపు చర్యలలో భాగంగా 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భాగంగా 31వ డివిజన్ గాదం రోశయ్య నగర్ లో శంకుస్థాపన కార్యక్రమానికి ఎలక్ట్రికల్ స్కూటీ పై వెళ్లారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. శాసన సభ్యునిగా నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల నాడిని తెలిసిన నేతగా మూడుసార్లు నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటించుకున్నారు.
దేశవ్యాప్తంగా ఎదురవుతున్న ఇంధన కొరత నేపథ్యంలో, పొదుపు పాటించాలంటూ.. అటు దేశ ప్రధాని ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుపై ఆయన స్పందించారు... నిత్యం పదుల సంఖ్యలో అనుచరులతో కాన్వాయ్ లో సాగే శ్రీధర్ రెడ్డి, ఒక్కసారిగా అధికార దర్పాన్ని, హడావిడిని మార్చేశారు.. తన వెంట ఉన్న గన్మెన్ వాహనాలతో సహా తన వాహనాన్ని సైతం పక్కనపెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఓ స్కూటర్ పై అనుచరుడితో, కలిసి శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరయ్యారు.. ఎమ్మెల్యే వస్తున్నారంటే వందల సంఖ్యలో కార్పొరేటర్లు అనుచరులతో , హడావిడి కనిపించే అభివృద్ధి కార్యక్రమాల స్థలం ఎమ్మెల్యే నిర్ణయంతో ఒక్కసారిగా మారిపోయింది.
తన వెంట ఉన్న వాహనాలన్నింటినీ పక్కనపెట్టి స్కూటర్ లోను అందులో ఎలక్ట్రిక్ బైక్ పై దాదాపు 32 చోట్ల జరగనున్న అభివృద్ధి పనులకు ఆయన హాజరై, శంకుస్థాపనలు చేస్తూ.. కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. రూరల్ ఎమ్మెల్యే చేసిన ఈ పొదుపు పాటింపు చర్య ఇప్పుడు రాజకీయ నేతలే కాదు అధికార వర్గాల్లో చర్చ తోపాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హామీలు ఇవ్వడం వాగ్దానాలు చేయటం ప్రజలకు పొదుపు మంత్రాలు ఉపదేశించడమే కాదు, ఆచరణలో వాటిని అమలు చేసినప్పుడే సార్థకత ఉంటుందనే సామాన్యుల మాటలకు ఎమ్మెల్యే అనుసరిస్తున్న విధానం ఆచరణీయం... ఆకర్షణియంగాను మారింది. ఇంధన పొదుపుపై ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలతో పాటు ఔరా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... భళా అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.




