Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రతి శుక్రవారం సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక.
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్
నెల్లూరు: నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రతి రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
వివిధ సమస్యలతో వస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రజల సూచనలు, సలహాల మేరకే నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు గిరిధర్ రెడ్డి.ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ప్రజల అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గ్రీవెన్స్ సెల్ ఇంచార్జ్ మంగళపూడి భాస్కర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు విజయ్ భాస్కర్, 22వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు యానాది రెడ్డి, టీడీపీ నాయకులు వడ్లమూడి రమేష్ చౌదరి, బండి రమేష్, శశిధర్ తదితరులు పాల్గొనారు.




