Nellore: నెల్లూరు రూరల్ జడ్పీటీసీగా చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి విజయం!

Nellore: నెల్లూరు రూరల్ జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి 4,094 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

A Praveen, Nellore
Published on: 7 Nov 2026 8:46 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్ జడ్పీటీసీగా చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి విజయం!

నెల్లూరు: నెల్లూరు రూరల్ జెడ్పీటీసీగా 4,094 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డికి రిటర్నింగ్ అధికారి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. తన విజయానికి విశేషంగా సహకరించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అచ్యుత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అదేవిధంగా తనపై నమ్మకంతో ఓట్లు వేసి అఖండ విజయాన్ని అందించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల రుణాన్ని అభివృద్ధి పనుల ద్వారా తీర్చుకుంటానని చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore