Nellore: నెల్లూరులో నేటి నుంచి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలు

Nellore: నెల్లూరు టౌన్‌హాల్‌లో శివసత్య సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగష్టు 11 నుంచి 15 వరకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘హరిహర వైభవం’ ప్రత్యేక ప్రవచనాలు.

A Praveen, Nellore
Published on: 11 Aug 2026 4:23 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో నేటి నుంచి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలు

నెల్లూరు: నెల్లూరు శివసత్య సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ 'హరిహర వైభవం' అనే అంశంపై ఐదు రోజుల పాటు ప్రత్యేక ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.ఆగష్టు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ ప్రాంగణంలో ఈ ఆధ్యాత్మిక సభలు జరగనున్నాయి.

​ఈ సందర్భంగా శివసత్య సంకల్ప ట్రస్ట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ... గత 15 ఏళ్లుగా నెల్లూరు పట్టణ ప్రజలకు సేవ చేస్తూ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నామని పేర్కొన్నారు. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల సాయంతో అనేక లక్షదీపోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తుచేశారు.

కార్యక్రమంలో భాగంగా మొదటి రోజైన నేడు (ఆగష్టు 11) సాయంత్రం 5 గంటలకు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి టౌన్ హాల్ వరకు పూజ్యశ్రీ సామవేదం షణ్ముఖశర్మ కి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. వేద పండితుల వేదోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గురువులను ఊరేగింపుగా సభా ప్రాంగణానికి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.

​సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను పరిరక్షించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ మహా ప్రవచన కార్యక్రమానికి నెల్లూరు పట్టణ ప్రజలు, భక్తులు మరియు హిందూ బంధువులు విశేష సంఖ్యలో హాజరై, ప్రవచనాలను ఆలకించి ధన్యులు కావాలని శివసత్య సంకల్ప ట్రస్ట్ ప్రతినిధులు కోరారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story