Nellore: పేద పిల్లల విద్య, ఆరోగ్యంపై కలెక్టర్‌కు వైసీపీ నేత అశోక్ వినతి
Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ డేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు అశోక్ పాల్గొన్నారు.
Nellore: పేద పిల్లల విద్య, ఆరోగ్యంపై కలెక్టర్‌కు వైసీపీ నేత అశోక్ వినతి
Nellore: నేడు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ డే (ఫిర్యాదుల స్వీకరణ) కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు సంబంధించిన రెండు కీలక సమస్యలపై జిల్లా కలెక్టర్ కి వినతిపత్రాలు సమర్పించారు.
1. ఆరోగ్యశ్రీ పథకం అమలు
ఐదు సంవత్సరాలు దాటిన అర్హులైన పిల్లలను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడంలో జరుగుతున్న జాప్యం కారణంగా పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అర్హులైన ప్రతి చిన్నారిని తక్షణమే ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
2. విద్య – బ్రిడ్జి కోర్సుల అమలు
ఆరు నుండి పదమూడు సంవత్సరాల వయస్సు కలిగి పాఠశాలలకు దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ పిల్లలను తిరిగి విద్యా ప్రవాహంలోకి తీసుకురావాలని కోరారు. వారి కోసం ప్రత్యేక బ్రిడ్జి కోర్సులు నిర్వహించి, వయస్సుకు అనుగుణంగా తగిన తరగతుల్లో చేర్పించి, విద్యా హక్కును కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్య మరియు ఆరోగ్యం ప్రాథమిక హక్కులు అని పేర్కొన్న తోడేటి అశోక్ ఈ అంశాలపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.




