Nellore: తృటిలో తప్పిన ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన స్కూటీ!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీకొన్నాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

Madhav Goud, Nellore
Published on: 29 Jun 2026 2:33 PM IST
Nellore
X

Nellore: తృటిలో తప్పిన ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన స్కూటీ!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలువాయి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ను వెల్డింగ్ షాప్ వద్ద నుంచి వచ్చిన స్కూటీ ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి రావడంతో బస్సును ఢీకొన్నాడు.

ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును పూర్తిగా కుడివైపుకు మళ్లించడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే స్కూటీపై ఉన్న వ్యక్తికి చెవి తెగిపోవడంతో పాటు కంటి పైభాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కోటయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story