Nellore: గంజాయి ముఠా అరెస్ట్.. 8.798 కేజీల గంజాయి స్వాధీనం

Nellore: నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 8.798 కేజీల గంజాయి పట్టుబడింది.

V. Narasimhulu, Nellore
Published on: 7 Jun 2026 11:09 AM IST
Nellore
X

Nellore: గంజాయి ముఠా అరెస్ట్.. 8.798 కేజీల గంజాయి స్వాధీనం

నెల్లూరు: నగరం లోని AC సుబ్బారెడ్డి స్టేడియం ముందు ఉదయం 05.00 గంటల నుండి 07.00 గంటల వరకు ఉన్నాతాధి కారుల ఆదేశాముల మేరకు వాహనాల తనిఖీ నిర్వహించుచుండగా.. APSRTC బస్సు AP 05 Z 5308 నందు అక్రమముగా గంజాయి రవాణా చేయుచున్న A1.అనీష్ కుమార్ మరియు A2.అమిత్ కుమార్ అను వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 8.798 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

వారు రాజమండ్రి లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి తిరుపతి నందు అమ్ముకొనుటకు తీసుకొని వెళుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పాల్గొన్న P&EI, P. రమేష్ బాబు, P&ESI- JKVN మురళి కృష్ణ మరియు హెడ్ కానిస్టేబుల్ M. కృష్ణయ్య, కానిస్టేబుల్స్ SK రఫీ, SK.అజీజ్ బాష లను పైఅధికారులు అభినందించినారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story