Nellore: అభివృద్ధికి పట్టం కట్టండి - మంత్రి నారాయణ కుమార్తె షరణి!

Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి నారాయణ కుమార్తె షరణి పొంగూరు. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.

V. Narasimhulu, Nellore
Published on: 24 Oct 2026 9:50 PM IST
Nellore
X

Nellore: అభివృద్ధికి పట్టం కట్టండి - మంత్రి నారాయణ కుమార్తె షరణి!

నెల్లూరు: నెల్లూరు నగరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 21, 22 మరియు 23వ డివిజన్లలో మంత్రి నారాయణ కుమార్తె షరణి పొంగూరు చేపట్టిన రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు విశేషంగా ఆకట్టుకుంటూ ఎన్నికల బరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఓటర్లతో మమేకమవుతూ అంకితభావంతో సాగుతున్న ఆమె ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతూ, భారీ గజమాలలతో ఘనస్వాగతం పలకగా, మహిళలు అడుగడుగునా దిష్టి తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలరించే బాణాసంచా పేలుళ్లు, ఆలయాలు-చర్చ్‌లలో ప్రత్యేక ప్రార్థనలతో హోరెత్తిన ఈ ప్రచారం మధ్యలో షరణి ఒక టిఫిన్ దుకాణంలో స్వయంగా దోసెలు వేస్తూ, వేడివేడి బోండాలు చేసి అక్కడి వారికి తినిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం నెల్లూరు నగరాభివృద్ధికి కేటాయించిన 5,748 కోట్లతో సాగుతున్న హరితవనం ప్రాజెక్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కుల ఆధునీకరణ, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు మరియు పేదల ఇళ్ల పట్టాల పరిష్కారం వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రతి ఇంటికీ వివరిస్తూ ముందుకు సాగారు.

నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ, కార్పొరేటర్ అభ్యర్థులు ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కాయల తిరుపతి, మరియు జనసేన అభ్యర్థులు గుర్రం కెజియా కుమారి, విజయలక్ష్మి రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ప్రచారంలో.. నగరంలో జరుగుతున్న అభివృద్ధే శ్రీరామరక్షగా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, ప్రత్యేకించి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ లక్షకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించడం తథ్యమని షరణి పొంగూరు ధీమా వ్యక్తం చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore