Nellore: క్రైమ్ స్పాట్లపై డిజిటల్ నిఘా.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు
Nellore: నెల్లూరు సబ్-డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల సందర్శించారు.
Nellore: క్రైమ్ స్పాట్లపై డిజిటల్ నిఘా.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు
Nellore: శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు సబ్-డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల. ఈ సందర్భంగా టౌన్ పరిధి మ్యాప్ పరిశీలిస్తూ వేదాయపాలెం మరియు నవాబ్‌పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో అవుట్‌పోస్టుల ఏర్పాటు పురోగతి, అలాగే దర్గామిట్ట మరియు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ కంట్రోల్స్ ఏర్పాటులో పురోగతి చర్యల చర్యలు టౌన్ ఏఎస్పీ దీక్షని , ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు పట్టణంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను విస్తృతంగా, సమర్థవంతంగా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు.
అదేవిధంగా, డిజిటల్ మ్యాపింగ్ సాయంతో క్రైమ్ స్పాట్లను గుర్తించడం, రౌడీషీటర్లు, అనుమానితులు, పరారీ నిందితులు, నాన్-బైలబుల్ వారెంట్లు (NBWs), సమన్లు అమలు, గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాలు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం టౌన్ ఎస్డిపిఓ నివాస భవనాన్ని సందర్శించి, అక్కడ ఉన్న సదుపాయాలను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు మరియు సౌకర్యాల మెరుగుదలపై AR DSPకి తగిన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు టౌన్ ఏఎస్‌పి దీక్ష, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఎస్‌బి CI శ్రీనివాసులు రెడ్డి, ఆర్‌ఐ (వెల్ఫేర్) రాజారావు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




