Nellore: నెల్లూరు జిల్లావ్యాప్తంగా పోలీసుల నాకాబంది!

Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో రాత్రివేళ నాకాబంది నిర్వహించిన పోలీసులు. లాడ్జీలు తనిఖీ చేసి భారీగా కేసులు నమోదు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 5 Sept 2026 2:42 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లావ్యాప్తంగా పోలీసుల నాకాబంది!

Nellore: ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలు మేరకు తేదీ. 04.09.26 రాత్రి 09:00 నుంచి 11:00 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబంది నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో మొత్తం 207 మంది అధికారులు మరియు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు జిల్లాలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అనుమానితుల నివాసాలు, వాణిజ్య సముదాయాలు, జాతీయ రహదారులు, జిల్లా ప్రవేశ మరియు నిష్క్రమణ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి.

ఈ తనిఖీలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించి 20 లాడ్జిలు తనిఖీ చేయడంతో పాటు, ఓపెన్ డ్రింకింగ్ కేసులు 19, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు – 14, మోటారు వాహన చట్టం (MV Act) కింద కేసులు – 237 నమోదు చేయడంతో పాటు, మొత్తం రూ.1,34,775/- జరిమానాలు విధించబడ్డాయి.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో పట్టణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం, రాత్రి సమయాల్లో రోడ్లపై ప్రశాంత వాతావరణం నెలకొల్పడం లక్ష్యంగా పోలీసులు సమగ్ర చర్యలు చేపడుతున్నారు.

అదేవిధంగా, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను మరింత తీవ్రతరం చేయడంతో పాటు, రాత్రి వేళల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రౌడీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, ఓపెన్ డ్రింకింగ్, పేకాట, గంజాయి వినియోగం మరియు అక్రమ వ్యాపారాలు, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, రహదారి ప్రమాదాలు తదితర అసాంఘిక కార్యకలాపాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజం లేదా అనుమానాస్పద కదలికల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు, డయల్-100/112కు లేదా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9392903143కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story