Nellore: హెల్మెట్ లేకపోతే ప్రాణాలకే ముప్పు.. స్కూల్ విద్యార్థులకు పోలీసుల క్లాస్!
Nellore: నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు అక్షర విద్యాలయంలో ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు.
Nellore: హెల్మెట్ లేకపోతే ప్రాణాలకే ముప్పు.. స్కూల్ విద్యార్థులకు పోలీసుల క్లాస్!
Nellore: జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల సూచనలు మేరకు రోడ్డు భద్రతపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా, ఈ రోజు వెంకటాచలం మండలంలోని అక్షర స్కూల్ (అక్షర విద్యాలయ) లో సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ....
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని వివరించారు.
ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని తెలియజేశారు.
మైనర్లు వాహనాలు నడపకూడదని, 18 సంవత్సరాలు పూర్తి చేసిన తరువాత మాత్రమే చట్టబద్ధమైన డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు.
ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలియజేశారు.
విద్యార్థి దశలోనే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని, అలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని హైలైట్ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అక్షర విద్యాలయ ఎన్‌సీసీ కమాండెంట్, స్కూల్ టీచర్లు, ఎన్‌సీసీ క్యాడెట్స్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




