Nellore: ఎండల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ కిట్లు

Nellore: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక 'కూలింగ్ కిట్లు' పంపిణీ చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 17 May 2026 8:57 AM IST
Nellore
X

Nellore: ఎండల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ కిట్లు

Nellore: పోలీస్ శాఖ అంటే ఒక కుటుంబం లాంటిదని, ఈ కుటుంబం లో ప్రతి ఒక్కరి సంక్షేమానికి మెదటి ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP హరీష్ కుమార్ గుప్త IPS ఆదేశాలు మేరకు, గుంటూరు IGP శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ సూచనలతో నిర్వహిస్తున్న "రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్" కార్యక్రమంలో భాగంగా, SPSR నెల్లూరు జిల్లా ఎస్పీ Dr. అజిత వెజెండ్ల శనివారం నెల్లూరు పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి కూలింగ్ కిట్లను పంపిణీ చేశారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎండలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం వెల్ఫేర్ కార్యక్రమంలో భాగంగా ఈ కిట్లను అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కూలింగ్ కిట్లలో కూలింగ్ జాకెట్ (ప్రత్యేకంగా ఢిల్లీ గుడుగాం నుండి తెప్పించారు), వాటర్ బాటిల్, చలువ కళ్లద్దాలు తదితర సామగ్రి ఉన్నాయన్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, విధులు సమర్థవంతంగా నిర్వహించినప్పుడు, ప్రజలకు పోలీసులపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

ప్రజలు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు.అలాగే రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అన్ని భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రహత్ పథకం గురించి వివరిస్తూ, రోడ్డు ప్రమాద బాధితులకు ఈ పథకం ద్వారా ₹1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్సను మొదటి 7 రోజుల పాటు ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో అందిస్తున్నట్లు తెలిపారు. “గోల్డెన్ అవర్” సమయంలో తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమన్నారు.

ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే వారికి గుడ్ సమారిటన్ మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రమాదాల సమయంలో ప్రజలు వెంటనే డయల్ 112 (ERSS) కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు ఈ పథకం పై అవగాహన కల్పిస్తున్నారని, హైవే మొబైల్ టీమ్స్‌ను అలర్ట్ చేసి బాధితులకు త్వరిత సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద బాధితుల ప్రాణ రక్షణలో ప్రజలు కూడా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ Ch సౌజన్య, టౌన్ ASP దీక్ష IPS , ఎస్బి డియస్పి, ట్రాఫిక్ CIs శ్రీ రామ కృష్ణ, వెంకట రెడ్డి, చిన్నబజార్ CI కోటేశ్వరరావు, సంత పేట CI సోమయ్య మరియు బాలాజీ నగర్ CI, సాంబ శివరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story