Nellore: వదంతులు నమ్మొద్దు.. పెట్రోల్ బంకులపై పోలీసుల నిరంతర నిఘా!

Nellore: నెల్లూరులో పెట్రోల్ బంకులపై ఎస్పీ అజిత వేజెండ్ల ఆకస్మిక తనిఖీలు.

V. Narasimhulu, Nellore
Published on: 28 April 2026 10:49 AM IST
Nellore
X

Nellore: వదంతులు నమ్మొద్దు.. పెట్రోల్ బంకులపై పోలీసుల నిరంతర నిఘా!

Nellore: కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల. పెట్రోల్ బంకుల వద్ద పోలీసుల నిరంతర నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, మరియు గౌరవ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,IPS., ఇచ్చిన ఆదేశాల మేరకు, సోమవారం నెల్లూరు నగర పరిధిలోని పలు పెట్రోల్ బంకులను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ..

జిల్లావ్యాప్తంగా ఉన్న 271 పెట్రోల్ బంకులలో పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు పుష్కలంగా సమృద్ధిగా ఉన్నాయని, సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక సాంకేతిక కారణాల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరిగినా, పరిస్థితి త్వరలోనే పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. వదంతులను నమ్మి భయాందోళనలకు గురై అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఇళ్ల వద్ద నిల్వ చేయడం ప్రమాదకరమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇళ్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇటువంటి చర్యలు ఇతరులకు ఇంధనం అందకుండా ఇబ్బందులు కలిగించే అవకాశముందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇంధన సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పై అధికారులకు నివేదించేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

అలాగే, ప్రతి పెట్రోల్ బంకు వద్ద ఒక పోలీసు కానిస్టేబుల్ మరియు ఒక వీఆర్ఓ ను ఒక బృందంగా ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వాహనాలకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి, రాత్రివేళల్లో కూడా అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేయడం, వదంతులు వ్యాప్తి చేయడం, లేదా ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు వదంతులను నమ్మకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్డిపిఓ, ఏఎస్పీ దీక్ష, చిన్నబజార్ సీఐ సి.హెచ్. కోటేశ్వరరావు, సౌత్ ట్రాఫిక్ సీఐ కె. వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story