Nellore: ఆపరేషన్ దండాయనపై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
Nellore: నెల్లూరు జిల్లాలో మహిళలు, బాలికలు, మరియు చిన్నారుల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ భద్రతను మరింత పటిష్టం చేసింది.
Nellore: ఆపరేషన్ దండాయనపై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
Nellore: మహిళలు, బాలికలు, మరియు చిన్నారుల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ మరింత భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేసింది... జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు మహిళలు బాలికలు చిన్నారులలో అవేర్నెస్ కలిగేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్, ఆపరేషన్ చిన్నారి తల్లి, ఆపరేషన్ దండాయనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రత కోసం శక్తి యాప్ వినియోగం, అత్యవసర సేవలు మరియు పోలీసు సహాయం పొందే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.
బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, POCSO చట్టం మరియు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు సూచనలు అందిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం 112, చిన్నారుల రక్షణ కోసం 1098, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930ను సంప్రదించాలని సూచించారు.




