Nellore: నెల్లూరు పోలీస్ బాస్‌ ‘ఆత్మీయ వీడ్కోలు’.. 43 ఏళ్ల సేవలకు ఎస్పీ సలాం!

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఘనంగా వీడ్కోలు పలికారు.

V. Narasimhulu, Nellore
Published on: 1 May 2026 11:10 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు పోలీస్ బాస్‌ ‘ఆత్మీయ వీడ్కోలు’.. 43 ఏళ్ల సేవలకు ఎస్పీ సలాం!

నెల్లూరు జిల్లా: పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో 30 ఏప్రిల్ 2026న సుదీర్ఘకాలం సేవలందించి, పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, ఆత్మీయంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్ అయిన సిబ్బందిని కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు, దుశాలువాలతో సత్కరించి స్మారక చిహ్నాలు అందజేశారు.

ఎస్.పి. అజితా వేజెండ్ల మాట్లాడుతూ..

పోలీసు సేవ అనేది క్రమశిక్షణ, అంకితభావం, ధైర్యం అవసరమయ్యే బాధ్యతాయుతమైన వృత్తి అని, దశాబ్దాల పాటు నిజాయితీతో సేవలందించిన సిబ్బంది పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సంతోషంగా జీవించాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా యస్పి ప్రస్తుతం మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో పని చేస్తున్న హర్ష వర్ధన్ రెడ్డి IES (SI పుల్లా రెడ్డి తనయుడు) మరియు ఇతర ప్రయోజకులు ఆయన వారి కుటుంబ సభ్యులుతో ముచ్చటించారు.

పదవీ విరమణ పొందిన సిబ్బంది వివరాలు (సంక్షిప్తంగా):

SI కె. బాలకృష్ణయ్య,

SI ఎం. పుల్లారెడ్డి – సుమారు 43 సంవత్సరాల సేవ;

SI ఎస్. సాయి ప్రసాద్ – సుమారు 42 సంవత్సరాలు;

అర్సీ ఎన్. ప్రభాకర్ రావు – సుమారు 41 సంవత్సరాలు;

అర్హక్ పి. వెంకటేశ్వర్లు – సుమారు 40 సంవత్సరాలు;

ASI జనకా వెంకటయ్య, మరియు ASI డి. హరి చంద్ర రెడ్డి – సుమారు 37 సంవత్సరాలు;

HC ఎస్. రామి రెడ్డి – సుమారు 36 సంవత్సరాలు.

వీరిలో పలువురు సేవాకాలంలో అనేక రివార్డులు, సేవా పతకాలు, ప్రశంసలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) సౌజన్య, టౌన్ ఎస్‌డిపిఓ/ఏఎస్పి దీక్ష IPS , ఏఆర్ డీఎస్పి చంద్ర మోహన్, AO చంద్ర మౌళి వెల్ఫేర్ మరియు అడ్మిన్ RI లు, మరియు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్దిపాటి ప్రసాద్ రావు ఇతర అధికారులు, సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story