Nellore: బక్రీద్ వేళ నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల మాస్ వార్నింగ్.. తనిఖీలు షురూ!

Nellore: బక్రీద్ పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, జంతు సంరక్షణ చట్టాల అమలుపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది.

V. Narasimhulu, Nellore
Published on: 22 May 2026 12:21 PM IST
Nellore
X

Nellore: బక్రీద్ వేళ నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల మాస్ వార్నింగ్.. తనిఖీలు షురూ!

Nellore: బక్రీద్ పండుగ నేపథ్యంలో మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులపై నెల్లూరు జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు జరగకుండా నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులకు సంబంధించిన కేసుల్లో గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు బౌండ్ ఓవర్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టులు, ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని, అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా మూగజీవాలను తరలించడం, అనుమతులు లేకుండా రవాణా చేయడం, జంతు హింసకు పాల్పడడం లేదా నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలు మరియు జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అవసరమైతే వాహనాల స్వాధీనం, అరెస్టులు, క్రిమినల్ కేసుల నమోదు వంటి చర్యలు కూడా అమలు చేస్తామని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు, సామాజిక సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తించినా వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, అనుమానాస్పద రవాణా లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story