Nellore: కోవూరులో మహిళా భద్రత సదస్సు.. 'శక్తి' లోగో ఆవిష్కరించిన ఎస్పీ!

Nellore: నెల్లూరు జిల్లా కోవూరు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో మహిళా భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Aug 2026 9:04 PM IST
Nellore
X

Nellore: కోవూరులో మహిళా భద్రత సదస్సు.. 'శక్తి' లోగో ఆవిష్కరించిన ఎస్పీ!

నెల్లూరు: నెల్లూరు జిల్లాకోవూరులో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కోవూరు నియోజకవర్గంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా శక్తి టీమ్ లోగోను ఆవిష్కరించి.. టీమ్ సభ్యులకు ప్రత్యేక జాకెట్లను అందజేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

మహిళల భద్రత కోసం జిల్లాలో ప్రత్యేకంగా శక్తి టీమ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. శక్తి యాప్‌లో ఉన్న SOS సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మహిళలపై నేరాలకు పాల్పడి జైలు నుంచి వచ్చిన వారిపై కూడా నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కుటుంబ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు పోలీసులను సంప్రదిస్తే కౌన్సెలింగ్ అందిస్తామని ఎస్పీ తెలిపారు. మహిళల రక్షణే తమ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ.. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story