Nellore: వేసవి తాపం నుండి రక్షణే లక్ష్యం.. రంగంలోకి నెల్లూరు పోలీసులు
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో సమ్మర్ సేఫ్టీ పోస్టర్ విడుదల. వేసవి ఎండల నుండి రక్షణ పొందేందుకు ప్రజలకు కీలక సూచనలు.
Nellore: వేసవి తాపం నుండి రక్షణే లక్ష్యం.. రంగంలోకి నెల్లూరు పోలీసులు
Nellore: వేసవి తాపం లో జిల్లా పోలీస్ సిబ్బంది తో పాటు, నెల్లూరు జిల్లా ప్రజలకు, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున , ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని తెలుపుతూ.. సమ్మర్ సేఫ్టీ పోస్టర్ టౌన్ ASP దీక్ష మరియు మీడియా సమక్షంలో రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల మాట్లాడుతూ..
వేసవి తాపం నుండి రక్షణ కోసం తరచూ నీరు, ORS, పండ్లరసాలు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా తల కప్పుకునే వస్త్రాలు ఉపయోగించాలని, వీలైనంతవరకు మధ్యాహ్న సమయంలో బయట తిరగడం నివారించాలని కోరారు.
ఇంట్లో ఉండి చల్లని వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలని, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా, టీ, కాఫీ వంటి పానీయాలు అధికంగా తీసుకోవడం, నేరుగా ఎండలో పని చేయడం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి నివారించాలని సూచించారు.
ప్రజలందరూ ఈ సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోందని చెప్పారు.




