Nellore: పోలీస్ స్టేషన్ రైటర్లు జాగ్రత్త.. మీ పనితీరుపై ఎస్పీ అజిత వేజెండ్ల ఫోకస్!

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల స్మార్ట్ పోలీసింగ్‌పై స్టేషన్ రైటర్లు మరియు CCTNS ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 May 2026 12:56 PM IST
Nellore
X

Nellore: పోలీస్ స్టేషన్ రైటర్లు జాగ్రత్త.. మీ పనితీరుపై ఎస్పీ అజిత వేజెండ్ల ఫోకస్!

నెల్లూరు జిల్లా: యస్.పి. డా. ఆజిత వేజెండ్ల, ఐపీఎస్ స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా స్టేషన్ రైటర్లు, CCTNS ఆపరేటర్లు మరియు సబ్-డివిజన్ కార్యాలయ రైటర్లతో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా యస్.పి అజిత వేజెండ్ల మాట్లాడుతూ..

CCTNS వ్యవస్థలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించడం, ఖచ్చితంగా నమోదు చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం, అసంపూర్ణ లేదా తప్పు నమోదు వల్ల జిల్లా ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరిస్తూ, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని ఆదేశించారు. సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకుని సమన్వయంతో పనిచేస్తే జిల్లాకు మంచి ర్యాంకింగ్ సాధ్యమవుతుందని తెలిపారు. ఎక్కడైనా సాంకేతిక లేదా విధానపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే పై అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.

తదుపరి ఉత్తమ పనితీరు కనబరిచిన స్టేషన్లను అభినందిస్తూ, ప్రతి నెల పనితీరు ఆధారంగా రివార్డులు అందజేయబడతాయని తెలిపారు. అలాగే రేపు నిర్వహించనున్న జిల్లా నెలవారీ నేర సమీక్ష సమావేశంలో CCTNS స్మార్ట్ పోలీసింగ్‌లో మంచి పనితీరు కనబరిచిన సిబ్బందిని రివార్డ్ రోల్‌లో చేర్చి ప్రశంసాపత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి (అడ్మిన్) చి. సౌజన్య, సీఐలు (DCRB, PCR, SB), సైబర్ వింగ్ సిబ్బంది, మరియు అన్ని పోలీస్ స్టేషన్ల CCTNS స్మార్ట్ పోలీసింగ్ ఆపరేటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story