Nellore: దుర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూలంగి సేవ

Nellore: నెల్లూరు దుర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస 5వ శుక్రవారం పూలంగి సేవ, లక్ష కుంకుమార్చన. పాల్గొన్న భక్తులు, అధికారులు.

A Praveen, Nellore
Published on: 11 Sept 2026 10:55 PM IST
Nellore
X

Nellore: దుర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూలంగి సేవ

నెల్లూరు: దుర్గామిట్టలో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము నందు శ్రావణ మాసం 5వ శుక్రవారం సందర్భముగా ఉదయం. శ్రీ అమ్మవారి అంతరాలయములో పూలంగి సేవ నిర్వహించడం జరిగినది. అనంతరం శ్రీఅమ్మవారికి జడపత్తితో ప్రత్యేక అలంకరణ చేయుట జరిగినది.

పూలంగి సేవ ఉభయకర్తలుగా శ్రీ కొలపర్తిరమేష్ -శ్రీమతి సువర్ణలక్ష్మి గార్లు వ్యవహరించినారు. తదుపరి అనివెట్టి మండపము నందు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి లక్ష కుంకుమార్చన నిర్వహించుట జరిగినది. లక్షకుంకుమార్చన పూజా కార్యక్రమములను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సూరావజ్ఞుల రఘు రామమూర్తి, ఉప ప్రధాన అర్చకులు, వేదపండితులు అర్చకులు ఆధ్వర్యములో అత్యంత వైభవముగా నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమములో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ అమ్మవారిని దర్శించుకొని అనంతంర తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరిగినది.

ఆలయ సహాయ కమీషనరుమరియు కార్యనిర్వహణాధికారి శ్రీ కోవూరు జనార్థన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ శ్రీమతి ఏలూరు శిరీష, ఆలయ ధర్మకర్తల మండలిసభ్యులు శ్రీ గజరా నరేష్, శ్రీమతి దావులూరు జమున శ్రీ గూడంశెట్టి దొరబాబు, శ్రీమతి మానికల నాగమణి, శ్రీ బిరదోలు చంటి, శ్రీమతి చీపన తేజ, శ్రీమతి రాపూరు రాధా కుమారి, శ్రీ నాటకరాణిచిన పెంచలయ్య, శ్రీ కుల్లూరు వీర రాఘవేంధ్ర ఆలయ ప్రధాన అర్చకులు, శ్రీ సూరావర్ణుల రఘురామమూర్తి, వేదపండితులు అర్చకులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో జరిగినవి.

A Praveen, Nellore

A Praveen, Nellore