Nellore: రైతు బజార్లలో అందుబాటు ధరలకే బియ్యం విక్రయాలు

Nellore: నెల్లూరు జిల్లా రైతు బజార్లలో అందుబాటు ధరలకే బియ్యం విక్రయాలు. బీపీటీ కిలో ₹49, కేఎన్‌ఎం ₹50కి లభ్యమని తెలిపిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు.

V. Narasimhulu, Nellore
Published on: 28 Oct 2026 11:26 PM IST
Nellore
X

Nellore: రైతు బజార్లలో అందుబాటు ధరలకే బియ్యం విక్రయాలు

నెల్లూరు: మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రైతు బజార్లలో ప్రజలకు అందుబాటు ధరలకు బియ్యం విక్రయాలు కొనసాగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు.

నగరంలోని ఫతేకాన్ పేట రైతు బజార్ ను సందర్శించి, ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ... నెల్లూరు నగరంలోని ఫతే ఖాన్‌పేట, నవాబుపేటతో పాటు గూడూరు, పొదలకూరు, కావలి రైతు బజార్లలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు బియ్యం విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ రైతు బజార్లలో బీపీటీ రకం బియ్యం కిలో రూ.49కు, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.

ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం అందించేందుకు ఈ విక్రయాలు ప్రారంభించినట్లు పేర్కొంటూ, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పుల్లయ్య తదితరులు ఉన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore