Nellore: అభ్యర్థులకు బీ-ఫారాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర!
Nellore: నెల్లూరు మున్సిపల్ పోరులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ బీ-ఫారాలు అందజేశారు.
Nellore: అభ్యర్థులకు బీ-ఫారాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర!
Nellore: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ బీఫారాలను పంపిణీ చేసింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బీ ఫారాలను స్థానిక శాసనసభ్యుల ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులకు పంపిణీ చేశారు... నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మికి బీఫారమ్స్ అందజేశారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు , శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్...
కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ,ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా టిడిపి అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ్ భేరి మోగిస్థారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




