Nellore: మంత్రి లోకేష్ సంస్కరణల వల్లే ప్రభుత్వ స్కూళ్లలో రికార్డు ఫలితాలు

Nellore: ఏపీ ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బద్దలు కొడుతూ 81% ఉత్తీర్ణత రావడం మంత్రి లోకేష్ ఘనతేనని నెల్లూరు టీడీపీ నేత చేజర్ల వెంకటేశ్వర రెడ్డి కొనియాడారు.

V. Narasimhulu, Nellore
Published on: 21 May 2026 9:24 PM IST
Nellore
X

Nellore: మంత్రి లోకేష్ సంస్కరణల వల్లే ప్రభుత్వ స్కూళ్లలో రికార్డు ఫలితాలు

Nellore: విద్యా శాఖ మంత్రి గా లోకేష్ విద్యారంగంలో తెచ్చిన మార్పుల ఫలితంగా ఈ ఏడాది 10 th, ఇంటర్ లో ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందన్నారు టిడిపి నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి. కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాయన్నారు. మెగా డిఎస్సీ నిర్వహించి దాదాపు 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం తో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారని చెప్పారు. విద్యాభ్యాసం తో పాటు యోగా,క్రీడలు, నైతిక విలువలు తో కూడిన తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

వైసీపీ హయాంలో నిర్వీర్యం ఆయన విద్యారంగాన్ని లోకేష్గాడిలో పెట్టారని, మన విద్యా విధానం ను దేశానికి ఆదర్శంగా తిరిదిద్దాలనే సంకల్పంతో లోకేష్ పనిచేస్తున్నారని చెప్పారు. కావున తల్లిదండ్రులో నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోని తమ పిల్లలను చేర్పించాలని కోరారు. నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ....

గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులలో కనీస నైపుణ్యం కూడా లేదని ఆసరా సంస్థ వెల్లడించిందని చెప్పారు. నాటి వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన అర్ధం,పర్ధం లేని సంస్కరణలు వలన, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు.టీచర్ పోస్టులు భర్తీ చేయక పోవడం వలన పాఠాలు చెప్పే వారే లేకుండా పోయారని చెప్పారు.

ఇటువంటి సమయంలో 2024 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను చక్కదిద్ది, మన విద్యార్థులకు భవిష్యత్తుకు మంచి పునాది వేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ , విద్య శాఖను చేపట్టారని ఆయన అన్నారు. నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన ఈ రెండు సంవత్సరాల కాలంలో, విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చారని వెల్లడించారు. మెగా డిఎస్సీ నిర్వహించి దాదాపు 16,347 పోస్టులను భర్తీ చేశారని, మౌలిక వసతులు కల్పన కు పెద్ద పీట వేశారని పేర్కొన్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు అవసరమైన ఉచిత పుస్తకాలు,కిట్స్ పాఠశాలలకు చేర్చే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. పదో తరగతి, మరియు ఇంటర్మేడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 100 రోజుల ప్రణాళికను అమలు చేశారని, దీంతో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. మంత్రి లోకేష్ కృషితో 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని, ఇంటర్ లో 81 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. అదే విధంగా 10 వ తరగతి ఫలితాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు, అత్యధిక మార్కులు సాధించి కార్పోరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు కు దీటుగా పలితాలు సాధించారని చెప్పారు. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం తో పాటు బోధనకు అవసరమైన ఉపాధ్యాయులు ను నియమించడంతో పాటు, యోగా, క్రీడలు, నైతిక విలువలు తో కూడిన తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story