Nellore: టీడీపీ జిల్లా కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం

Nellore: నెల్లూరులో టీడీపీ జిల్లా కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, నేతలు.

V. Narasimhulu, Nellore
Published on: 15 Sept 2026 11:09 PM IST
Nellore
X

Nellore: టీడీపీ జిల్లా కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం

నెల్లూరు: నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర అధ్యక్షతన కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి సమన్వయం మరియు కార్యాచరణ పై కూటమినేతలతో చర్చించడం జరిగింది.

సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ , జోనల్ కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, ఆర్టీసీ రీజినల్ కోఆర్డినేటర్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ రఘునాథరాజు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, దుగ్గిశెట్టి సుజయ్ నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore