Nellore: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం!
Nellore: నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కీలక సమావేశం జరిగింది.
Nellore: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం!
Nellore: తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. కేడర్ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, బూత్ స్థాయి కార్యకలాపాలు, అంతర్గత సమన్వయ యంత్రాంగం, నాయకత్వ సమాచార మార్పిడి, సంస్థాగత జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం.
ప్రస్తుతం జరుగుతున్న పార్టీ కార్యక్రమాల సమీక్ష, ప్రజల సమీకరణ, ఇంటింటికీ ప్రచారం (D2D), లబ్దిదారులతో మమేకమవ్వడం మరియు పబ్లిక్ ఇన్ట్రాక్షన్ కార్యక్రమాలు. రెండేళ్ల సుపరిపాలన ప్రభుత్వ కీలక విజయాలు, సంక్షేమ పథకాల పంపిణీ, అభివృద్ధి పనులు, లబ్దిదారుల లభ్యత మరియు క్షేత్రస్థాయిలో పాలనా ప్రభావంపై చర్చ.
SIR కార్యకలాపాలు (సన్నద్ధత):- SIR కార్యక్రమాల పై చర్చ, సమన్వయ యంత్రాంగం, సమీకరణ ప్రణాళిక మరియు అమలుకు సన్నద్ధత. స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నద్ధత బూత్ స్థాయి సమన్వయాన్ని బలోపేతం చేయడం, స్థానిక సంస్థాగత లోపాలను గుర్తించడం, సమర్థులైన స్థానిక నాయకత్వాన్ని ఎంపిక చేయడం, ఎన్నికల సన్నద్ధతను మెరుగుపరచడం మరియు క్యాడర్ సమీకరణను మెరుగుపరచడం.
పార్లమెంట్ కార్యవర్గ సభ్యులను మండల పరిశీలకులుగా నియమించుట గురించి గ్రామ, మండల, నియోజకవర్గ అనుబంధ విభాగాల పటిష్టత గురించి. రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ అధ్యక్షులు నియోజకవర్గ పర్యటనలు, సమీక్షల గురించి. యూనిట్, మండలం, నియోజకవర్గం, పార్లమెంట్ పార్టీ క్యాలెండర్ సమావేశాల గురించి. చర్చ జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, కాకర్ల సురేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి , పార్లమెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




