Nellore: నెల్లూరులో టీడీపీ నేతల మీడియా సమావేశం బీసీ రిజర్వేషన్లపై వైసీపీ కుట్రలు

Nellore: నెల్లూరులో టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న ఘనత వైసీపీదేనని తీవ్రంగా విమర్శించారు.

A Praveen, Nellore
Published on: 9 Oct 2026 11:40 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో టీడీపీ నేతల మీడియా సమావేశం బీసీ రిజర్వేషన్లపై వైసీపీ కుట్రలు

నెల్లూరు: చట్టసభల్లో బీసీలు ప్రాతినిధ్యం వహించే విధంగా వారికి సముచిత స్థానం కల్పించడమే టీడీపీ లక్ష్యం. బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగకూడదని గొడ్డలి పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు. బీసీలకు సామాజిక, రాజకీయ న్యాయం చేయాలన్నదే టీడీపీ లక్ష్యం, వారి హక్కులను అడ్డుకోవడమే వైసీపీ వైఖరి.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం అవకాశాలను ఇచ్చి బడుగు బలహీన వర్గాల రాజకీయ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. బీసీల హక్కుల కోసం టీడీపీ నిరంతరం పోరాడుతుంది, వారి అభ్యున్నతికి కట్టుబడి ఉంటుంది.

బీసీలకు 34శాతం రిజర్వేషన్ అంశాన్ని వైసిపి హయాంలో హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలను తీరని అన్యాయం చేశారు. బీసీల అభ్యున్నతి, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 105, 1065 లను వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి పిటిషన్ ద్వారా అడ్డుకున్నారు. వైసీపీ హయాంలో 34 శాతం రిజర్వేషన్ అమలు చేసినట్లయితే 16,800 మంది బీసీలు నాయకులుగా ఎదిగేవారు.

ఇటువంటి అద్భుత అవకాశాన్ని నీరుగార్చి బీసీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం తమ హయాంలో రాజకీయ సమాధి కట్టింది. పంచాయతీ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లుగా బీసీలు ఎదిగే అవకాశాన్ని దూరం చేసిన చరిత్ర గొడ్డలి పార్టీ ది.

A Praveen, Nellore

A Praveen, Nellore