Nellore: కానిస్టేబుల్ ఇంట్లో చోరీ.. దొరికిన దొంగ
Nellore: నెల్లూరులో విచిత్రమైన దొంగతనం కేసు. పోలీసులకే సవాల్ విసురుతూ ఏకంగా కానిస్టేబుల్ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డ దొంగను చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు.
Nellore: కానిస్టేబుల్ ఇంట్లో చోరీ.. దొరికిన దొంగ
Nellore: పోలీసుల్ని చూస్తేనే ఆమడ దూరం పరిగెత్తే దొంగల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఏకంగా ఓ కానిస్టేబుల్ ఇంటిని ఎంచుకొని మరి చోరీకి పాల్పడ్డాడు ఓ దొంగ. ఎరక్కపోయి వచ్చాడో లేక, దొంగతనం చేసి పోలీసులకే సవాల్ విసరాలి అనుకున్నాడో ఏమోగానీ మొత్తానికి, అనుకున్నదొకటి అయిందొకటి అన్న రీతిగా ఈ దొంగ ఆట కట్టించి, కటకటాల వెనక్కి పంపించారు నెల్లూరు చిన్న బజార్ పోలీసులు.
నెల్లూరులో కానిస్టేబుల్ ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు.. చిన్నబజారు పోలీసులు. నిందితుడి నుంచి 22.65 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జొన్నవాడ రోడ్ పోలీస్ కాలనీలోని ఏపీఎస్పీ కానిస్టేబుల్ వెంకటరాజు ఇంట్లో పూజ గదిలో దాచిన నగలు ఆ కుటుంబానికి పరిచయస్తుడైన షేక్ ఖాసిం బంగారం దొంగతనం చేసాడు. మే 19న కుటుంబ సభ్యులు బిజీగా ఉన్న సమయంలో పూజ గదిలోకి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో, రంగంలోకి దిగిన చిన్నబజారు సీఐ ఎస్. శ్రీనివాసరావు, ఎస్సై ఎ. అయ్యప్ప బృందం.షేక్ ఖాసింను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు.




