Nellore: ఘనంగా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
Nellore: నెల్లూరులో అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి.
Nellore: ఘనంగా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
నెల్లూరు: నెల్లూరు లోని 6వ డివిజన్ పప్పుల వీధి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఆయనకు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
మంత్రి నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు..రాష్ట్ర ఆర్య వైశ్య గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అక్షయ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొనగా, ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గ సభ్యులను మంత్రి నారాయణ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మునగా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కోట రమేష్‌బాబు, కోశాధికారి CA జె.వి. చలపతిరావు, మహిళా విభాగ అధ్యక్షురాలు శేషాద్రి సువర్ణకుమారి, యువజన విభాగ అధ్యక్షులు CA వేముల హరిశంకర్‌లతో పాటు 100 మందికి పైగా సభ్యులతో ఏర్పాటైన ఈ భారీ కమిటీ సంఘ ఐక్యతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పురోగతికి జీఎస్టీ, ఇన్కమ్ టాక్స్ చెల్లించే వ్యాపారవేత్తలైన ఆర్యవైశ్యుల పాత్ర అత్యంత కీలకమని, నీతి నిజాయితీలతో వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని కొనియాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరులో ఎస్పీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు పూర్తి ప్రశాంత, సురక్షిత వాతావరణం కల్పించామని స్పష్టం చేశారు. పేదల చదువులకు సాయం, కోవిడ్ సమయం నుండి నిత్య అన్నదానాల వరకు ఆర్యవైశ్యులు అందిస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమన్నారు...ఆర్యవైశ్య సంఘం చేపట్టే అన్ని సేవా కార్యక్రమాలకు మునిసిపల్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.




