Nellore: నెల్లూరు నగరంలో దోపిడీ దొంగల హల్చల్
Nellore: నెల్లూరు నగరం వనంతోపు సెంటర్‌లోని కల్పతరువు అపార్ట్‌మెంట్‌లో పట్టపగలు భారీ దోపిడీ జరిగింది.
Nellore: నెల్లూరు నగరంలో దోపిడీ దొంగల హల్చల్
Nellore: నెల్లూరు నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం నగరంలోని ఓ అపార్ట్మెంట్లో భారీగా నగలు దోచుకెళ్లారు... ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వనంతోపు సెంటర్ మూడో వీధిలో.. కల్పతరువు అపార్ట్మెంట్లో ఈ చోరీ జరిగింది. తలకు హెల్మెట్ కట్టుకొని నేరుగా అపార్ట్మెంట్ లోకి వెళ్లిన దుండగులు రెండవ ఫ్లోర్ లో ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి,
ఆపై బీరువాలో ఉన్న 30 సవర్ల బంగారు రెండు కేజీల వెండిని దోచుకెళ్లారు. ఇంటి యజమాని వచ్చి చూడడంతో.. ఈ చోరీ వ్యవహారం వెలుగు చూసింది. ఇంటి యజమాని యమున హైదరాబాదు వెళ్లిన పరిస్థితిని గమనించి దొంగలు, ఈ దోపిడీకి పాల్పడడం తెలిసిన వారి పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు,
సిసి ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడడం పై స్థానిక అపార్ట్మెంట్ తో పాటు, వనంతోపు ప్రాంతంలో కలకలం రేపుతోంది.




