Nellore: వరికుంటపాడులో బయోగ్యాస్ ప్రాజెక్ట్‌పై వెల్లువెత్తుతున్న నిరసనలు!
Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ప్రతిపాదిత బయోగ్యాస్ ప్రాజెక్ట్‌పై పది గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Nellore: వరికుంటపాడులో బయోగ్యాస్ ప్రాజెక్ట్‌పై వెల్లువెత్తుతున్న నిరసనలు!
నెల్లూరు జిల్లా: వరికుంటపాడు మండలంలో ప్రతిపాదిత బయోగ్యాస్ ప్రాజెక్ట్‌పై గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మండలంలోని పది గ్రామాల పరిధిలో సుమారు 1,500 ఎకరాల్లో బయోగ్యాస్ ఉత్పత్తి కోసం అవసరమైన గడ్డి సాగు చేపట్టేందుకు ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో కొండ పోరంబోకు భూములను కేటాయించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.ఇదే సమయంలో ప్రాజెక్టు పనులను కార్పొరేట్ సంస్థ వేగవంతం చేస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది.
కొండ పోరంబోకు భూముల కేటాయింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు వరికుంటపాడు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ భూములు గ్రామాల అవసరాలకు, పశువుల మేతకు, భవిష్యత్ అవసరాలకు ఎంతో కీలకమని వారు వివరించారు.
అలాగే రైతుల భూములు, గ్రామాల హక్కులు దెబ్బతినకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో బయోగ్యాస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్రామస్తుల డిమాండ్లపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.




