Nellore: వెంగళరావు నగర్ హైస్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవం ఘనం!
Nellore: నెల్లూరు వెంగళరావు నగర్ పాఠశాలలో 10 ఆంధ్రా నేవల్ యూనిట్ ఎన్సీసీ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవం. పింగళి వెంకయ్య సేవలను స్మరించుకున్న నరేంద్రబాబు.
Nellore: వెంగళరావు నగర్ హైస్కూల్లో జాతీయ పతాక ఆమోద దినోత్సవం ఘనం!
Nellore: "10 ఆంధ్ర నేవల్ యూనిట్" ఎన్సీసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోదంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు... నగరపాలక ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్, నెల్లూరు నందు "10 ఆంధ్ర నేవల్ యూనిట్" ఎన్సీసి ఫస్ట్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ ఆధ్వర్యంలో... జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గుండాల నరేంద్ర బాబు మాట్లాడుతూ....
దేశ సమగ్రతకు జాతీయ సమైక్యతకు జాతీయ జెండా నిదర్శనమని, ఈ జాతీయ పతాకాన్ని తెలుగు బిడ్డ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య తయారు చేశారని, ఇందులోని కాషాయ వర్ణం ధైర్యానికి సాహసానికి తెగువకు పరాక్రమానికి నిదర్శనమని, తెలుపు రంగు శాంతికి సహనానికి సౌశీల్యానికి ప్రతీకని, ఆకుపచ్చ రంగు దేశ అభివృద్ధికి సస్యశ్యామలమైన దేశానికి చిహ్నమని, కాషాయ రంగుకి ఆకుపచ్చ రంగుకి నడుమ ఉన్న తెలుపు రంగులో ఉన్నటువంటి అశోక ధర్మ చక్రం, 24 గంటల ధర్మానికి గుర్తు అని,
ప్రతి భారతీయుడు జాతీయ జెండాని గౌరవించాలని, భారతీయుడుగా పుట్టినందుకు గర్వించాలని, 1947 వ సంవత్సరం జూలై 22వ తేదీన ఈ త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా మనం స్వీకరించి ఆమోదించుకున్నామని, 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు బ్రిటిష్ వారి నుంచి లభించిన స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకి, సమానత్వానికి నిదర్శనంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశ స్వాతంత్ర్య సమూపార్జనలో అసువులు బాసిన, అమర వీరులైన, స్వాతంత్ర్య సమర యోధులకు, దేశ భక్తులకు ఈ సందర్భంగా వారిని స్మరిస్తూ వారి నిస్వార్థ సేవలో నేటి యువత ఎన్సీసి క్యాడేట్స్ అందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా నరేంద్రబాబు ఉద్భోదించారు.
అంతేకాకుండా ప్రతి ఒక్కరూ బాల్యదశ నుంచే దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, పోరాటపటిమ అలవర్చుకోవాలని, తోటి వారితో సోదర భావంతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసి క్యాడె ట్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీ మంజులవాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




