Nellore: వెంగారెడ్డిపాలెం అంగన్‌వాడీలో చిన్నారులకు ఘన వీడ్కోలు!
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
Nellore: వెంగారెడ్డిపాలెం అంగన్‌వాడీలో చిన్నారులకు ఘన వీడ్కోలు!
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో 1వ తరగతికి వెళ్లనున్న చిన్నారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను అభినందించి, వారి విద్యాభ్యాసంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ వర్కర్ సుశీలమ్మ, ఆయా లక్ష్మి తదితరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Next Story




