Nellore: జర్నలిజం పేరుతో దోపిడీ.. అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Nellore: నెల్లూరు నగరంలో మీడియా ముసుగులో సాగుతున్న అక్రమ వసూళ్లు, బ్లాక్‌మెయిల్ దందాలపై మంత్రి పొంగూరు నారాయణకు వినతిపత్రం అందజేసిన వీడియో జర్నలిస్టుల సంఘం.

V. Narasimhulu, Nellore
Published on: 18 May 2026 8:16 AM IST
Nellore
X

Nellore: జర్నలిజం పేరుతో దోపిడీ.. అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Nellore: మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ జర్నలిస్టుల ఆట కట్టించమంటూ.. మంత్రి నారాయణ కు వినతిపత్రం అందించారు వీడియో జర్నలిస్టులు... నకిలీ జర్నలిస్టుల ఆటకట్టించండి అని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లింది వీడియో జర్నలిస్టుల సంఘం.

నెల్లూరు నగరంలో మీడియా ముసుగులో సాగుతున్న అనధికార యూట్యూబ్ ఛానళ్ల బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, దందాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీడియో జర్నలిస్టులు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకు వినతిపత్రం అందజేశారు. పత్రికా రంగానికి ఎలాంటి సంబంధం లేకుండా, సోషల్ మీడియా పేరుతో సాధారణ పౌరులు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తూ, ఇవ్వని పక్షంలో పరువు తీస్తామని బెదిరిస్తున్న నకిలీ జర్నలిస్టులపై సమగ్ర విచారణ జరిపి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఈ అక్రమ వసూళ్ల వల్ల సమాజంలో నిజాయితీగా పనిచేసే జర్నలిస్టుల ప్రతిష్ట దెబ్బతింటోందని వారు మంత్రి దృష్టికి తీసుకురాగా, దీనిపై స్పందించిన మంత్రి నారాయణ తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story