Sangam: సంగంలో వీఆర్ఏల ఆందోళన 24వ రోజుకు చేరిక - వినూత్న నిరసన
Sangam: నెల్లూరు జిల్లా సంగంలో వీఆర్ఏల ఆందోళన 24వ రోజుకు చేరింది. ప్రభుత్వ స్పందన కోరుతూ చేతులకు తాళ్లు కట్టుకుని వీఆర్ఏలు వినూత్న నిరసన తెలిపారు.
Sangam: సంగంలో వీఆర్ఏల ఆందోళన 24వ రోజుకు చేరిక - వినూత్న నిరసన
సంగం: నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల ఆందోళన 24వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల ధర్నా 24వ రోజుగా కొనసాగుతున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు చేతులకు తాళ్లు కట్టుకుని, సంకెళ్ల తరహాలో వినూత్న నిరసన ప్రదర్శన చేశారు.
24 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు.




