Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో జనసేనలోకి భారీగా యువత చేరికలు

Nellore: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలతో నెల్లూరు 21వ డివిజన్‌లో కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున యువత జనసేనలో చేరారు.

A Praveen, Nellore
Published on: 7 Oct 2026 8:38 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో జనసేనలోకి భారీగా యువత చేరికలు

నెల్లూరు: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతకు ఆకర్షితులై 21వ డివిజన్ పరిధిలోని పాత 16వ డివిజన్, గుర్రాలమడుగు సంఘం, రాంజీనగర్ ప్రాంతానికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు.

జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో స్థానిక 21వ డివిజన్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముందు రాంజీనగర్ 7వ లైన్‌లోని కిషోర్ గునుకుల నివాసం నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్ మీదుగా ముత్తుకూరు సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో బైక్‌లపై పాల్గొనడంతో పాటు డీజే కార్యక్రమంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకుంది.

ఈ సందర్భంగా విజయలక్ష్మి గునుకుల నూతనంగా పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కిషోర్ గునుకుల మాట్లాడుతూ...

“శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దశాబ్దాలుగా అభిమానిస్తూ, ఆయన ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి క్రాంతి, సుమంత్ తదితరులు ఈరోజు పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. వృత్తి, వ్యాపారాల కారణంగా తమ తమ రంగాల్లో ఉంటూనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరంతా ఇకపై జనసేన పార్టీకి అండగా నిలవడం 21వ డివిజన్‌లో పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుంది.

ఈరోజు జరిగిన ఈ చేరికలు రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ఒక బలమైన నాంది అని భావిస్తున్నాం. రేపటి నుంచి డివిజన్‌లో ప్రజలను నేరుగా కలుసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తాం.

పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, ఆయన ఆశయాలను నమ్మే ప్రతి యువకుడు జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలి. యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రజల కోసం పనిచేయాలి, పార్టీని బలోపేతం చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి గడపను చేరుకుని కూటమి విజయానికి కృషి చేస్తాం.

ఈరోజు క్రాంతి, సుమంత్‌తో పాటు పెద్ద సంఖ్యలో యువత జనసేనలో చేరడం మాకు ఎంతో ఉత్సాహాన్ని, మరింత బలాన్ని ఇచ్చింది. వీరందరినీ జనసేన కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం” అని కిషోర్ గునుకుల తెలిపారు.

పార్టీలో చేరిన వారు

క్రాంతి, సుమంత్, సందీప్, కల్యాణ్, సుజీత్, రాజేష్, మహీష్, శ్రీకాంత్, వెంకీ, అప్పూ, వంశీ, అనిల్, శ్రీను తదితరులు జనసేన పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ప్రశాంత్ గౌడ్, నాగేంద్ర బాబు, హేమచంద్ర యాదవ్, నరహరి, విశ్రాంత్, మహిళా నాయకులు విజయ, ప్రవల్లిక, కృష్ణవేణి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

యువత ఉత్సాహభరిత నినాదాలు, బైక్ ర్యాలీ, డీజే కార్యక్రమంతో ఈ చేరికల కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగింది.

A Praveen, Nellore

A Praveen, Nellore