Nellore: మానవత్వం చాటుకున్న యువత.. సొంత ఖర్చుతో వన్యప్రాణులకు సేవ

Nellore: ఎండ వేడిమికి విలవిల్లాడుతున్న వన్యప్రాణుల దాహం తీర్చేందుకు ఐదుగురు యువకులు తమ సొంత ఖర్చులతో అడవిలో నీటి తోట్లు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు.

M Satya Peter, Atmakur
Published on: 29 April 2026 2:52 PM IST
Nellore
X

Nellore: మానవత్వం చాటుకున్న యువత.. సొంత ఖర్చుతో వన్యప్రాణులకు సేవ

Nellore: కొద్ది రోజులుగా సూర్యుడు భగభగ లాడుతున్నాడు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎండ వేడిమిని మనుషులు, మూగజీవాలు తట్టుకోలేక పోతున్నాయి. ముఖ్యంగా పశుపక్ష్యాదులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఎంత దూరమైన వెళ్లి దప్పిక తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాగునీటి కోసం మూగజీవాలు చేస్తున్న అన్వేషణను కళ్లారా చూసి చలించిపోయిన నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామానికి చెందిన కన్నెమరకల రమణయ్య,

కన్నెమరకల పెద్ద నరసింహులు, కన్నెమరకల రత్తయ్య, కన్నెమరకల శ్రీనివాసులు, తొడేటి నరేష్ వాటి దప్పిక తీర్చేందుకు తమ సొంత ఖర్చులతో అడవిలో మర్రిపాడు నుండి చుంచులూరు, రాజుపాలెం సరిహద్దు హైవే ప్రాంతం వరకు ఏర్పాటు చేసిన నీటి తోట్లలో గత నాలుగు వారాలుగా ట్యాంకర్ సాయం తో నీళ్లు నింపి వానరాలకు దాహం తీర్చుతూ, ఆకలికి అరటి పండ్లు వేస్తూ తనవంతు సహకారం అందిస్తున్నారు.

తొట్లల్లో నింపిన నీటిని అనేక రకాల మూగజీవాలు తాగి దప్పిక తీర్చుకుం టుంటే అది కళ్లారా చూస్తున్న వారు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కోతులు, ఉడతలు, దుప్పిలు,ఆవులతో పాటు వివిధ రకాల వన్యప్రాణులు ఈ నీటిని తాగి సేద తీర్చుకుంటున్నాయి. సుమారు నాలుగు వారాల నుంచి ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్న వారిని పలువురు జంతుప్రేమికులు అభినందిస్తున్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story