Marripadu: చిన్నమాచనూరులో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అన్నదానం చేపట్టారు.
Marripadu: చిన్నమాచనూరులో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చిన్నమాచనూరు పంచాయతీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాస నాయుడు సూచనల మేరకు పంచాయతీ వైసీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి మండల వైసీపీ కన్వీనర్ చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి, బాబు, నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అనంతరం మండేది ఓబుల్‌రెడ్డి, ఆకుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో షేక్ ఖాజా గరీబ్, ఒంగోలు బాలకృష్ణారెడ్డి, ఒంగోలు కిరణ్‌రెడ్డి, సడ్డా ప్రసాద్ నాయుడు, కోఆప్షన్ సభ్యుడు షేక్ హసన్ సాహెబ్, బోగాల చిన్న ప్రసాద్, బోగాల పెద్ద ప్రసాద్, ఇండేల వెంకట రాములు, ఇండేలా తిరుపాలు రెడ్డి, ఎడమకంటి నిరంజన్‌రెడ్డి, ఆకుల హజరత్‌రెడ్డి, బోగాల 5వ వెంగల్‌రెడ్డి, కాటిబోయిన వెంగయ్య, తమటం శ్రీనివాసులురెడ్డి, ఎడమకంటి నాగేశ్వర్‌రెడ్డి, షేక్ ముజీబ్, ఎడమకంటి మహేష్‌రెడ్డి, బిల్లుపాటి మాలకొండయ్య, నూతలపాటి తిరుపతయ్య, నూతలపాటి హరిబాబు, ఒంగోలు వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




