Nellore: నెల్లూరులో ముగిసిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష

Nellore: నెల్లూరులో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగింపు.

V. Narasimhulu, Nellore
Published on: 8 Aug 2026 9:38 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ముగిసిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష

నెల్లూరు: రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో, ఎమ్మెల్సీ, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా 13వ డివిజన్ కార్పొరేటర్, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున్ మాట్లాడుతూ, రిలే నిరాహార దీక్షను విజయవంతం చేసిన యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story