Nellore: గత 30 సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు!

Nellore: నెల్లూరులోని డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్య విభాగాన్ని అడిషనల్ ఎస్పీ సౌజన్య, సునీల్ కుమార్, డాక్టర్ వేణుగోపాల్ ప్రారంభించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 24 Oct 2026 12:03 PM IST
Nellore
X

Nellore: గత 30 సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు!

Nellore: నెల్లూరు నగరంలోని డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్య విభాగాన్ని అడిషనల్ ఎస్పీ సౌజన్య, వెంకటేశ్వర కాలేజ్ చైర్మన్ సునీల్ కుమార్, డాక్టర్ వేణుగోపాల్ ప్రారంభించారు.

గత 30 సంవత్సరాలుగా నెల్లూరు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ సేవలను ఈ సందర్భంగా వెంకటేశ్వర కాలేజ్ చైర్మన్ సునీల్ కుమార్ కొనియాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి చేస్తున్న కృషిని అభినందించారు.

జీవీకే మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికీ అత్యాధునిక వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో నూతన దంత వైద్య విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించేందుకు ఈ విభాగం దోహదపడుతుందని పేర్కొన్నారు.

డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులోనూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ, వారికి అండగా నిలుస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

నూతన దంత వైద్య విభాగం ప్రారంభంతో నెల్లూరు నగర ప్రజలకు మరిన్ని మెరుగైన దంత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE