Nellore: "శ్రీ కృష్ణ ధర్మరాజ స్వామి ఆలయ పాలకమండలి అభినందన సభలో పాల్గొన్న మంత్రి నారాయణ"

Nellore: నెల్లూరు మూలపేట శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి ఆలయ నూతన పాలకమండలి అభినందన సభలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 12 Jun 2026 11:58 AM IST
Nellore
X

Nellore: "శ్రీ కృష్ణ ధర్మరాజ స్వామి ఆలయ పాలకమండలి అభినందన సభలో పాల్గొన్న మంత్రి నారాయణ"

Nellore: నెల్లూరు సిటీ, మూలపేట శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి ఆలయ పాలకమండలి అభినందన సభ, ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ.. మంత్రికి పాలకమండలి చైర్మన్ వేలూరు పెంచల్ రాజా,సభ్యులు,టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి నారాయణ. నూతన ఛైర్మెన్,కమిటీ సభ్యులను సన్మానించి అభినందించిన మంత్రి.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..

మొత్తం 11 మందితో నూతన పాలకమండలిని ఏర్పాటు చేశామని,అన్నివర్గాలకి, మహిళలకు ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. ఈ ఆలయం చాలా పురాతనమైన విశిష్టత కలిగిన ఆలయం అని పేర్కొన్నారు. మూడేళ్లకోసారి బ్రహ్మోస్తావాలను 21 రోజులు వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. పదవిని బాధ్యతగా భావించి, కమిటీ భక్తులకు సేవ చేయాలని సూచించారు.పదవికి వన్నె తెచ్చే విధంగా పాలక మండలి పనితీరు ఉండాలని కోరారు.

దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాతా అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యాసమస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ, మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి, డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story