Sangam: సంగం నూతన తహసిల్దారుగా సారంగపాణి బాధ్యతల స్వీకరణ!

Sangam: నెల్లూరు జిల్లా సంగం మండల నూతన తహసిల్దారుగా సారంగపాణి శనివారం బాధ్యతలు స్వీకరించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 20 Jun 2026 9:00 PM IST
Sangam
X

Sangam: సంగం నూతన తహసిల్దారుగా సారంగపాణి బాధ్యతల స్వీకరణ!

సంగం: మండల తాహసిల్దారుగా సారంగపాణి నియమితులయ్యారు. శనివారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి బదిలీ పై ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల తక్షణమే స్పందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అలాగే భూ సమస్యలు రీ సర్వే వంటి కార్యక్రమాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు రికార్డులు సరిదిద్ది ప్రజలకు సేవలు అందిస్తానన్నారు. అలాగే మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా తహసిల్దార్ ను పలువురు కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story