Kavali: నగర పంచాయతీ వద్దు.. గ్రామపంచాయతీలుగానే కొనసాగించాలి!

Kavali: కావలి నియోజకవర్గంలోని అల్లూరు, నార్త్ మోపూర్, సింగపేట గ్రామాలను నగర పంచాయతీలుగా మార్చవద్దని అఖిలపక్షం నామినేషన్లను బహిష్కరించి నిరసన తెలిపింది.

A Praveen, Nellore
Published on: 14 Nov 2026 9:51 PM IST
Kavali
X

Kavali: నగర పంచాయతీ వద్దు.. గ్రామపంచాయతీలుగానే కొనసాగించాలి!

కావలి: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని అల్లూరు, నార్త్ మోపూర్, సింగపేట గ్రామాలను నగర పంచాయతీలుగా మార్చవద్దని, గతంలో ఉన్నట్లుగానే గ్రామపంచాయతీలుగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ప్రధాన నాయకులు నిరసనకు దిగారు.

ఈ మేరకు ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజే నామినేషన్ల ప్రక్రియను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. గ్రామాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నగర పంచాయతీలుగా మార్చే నిర్ణయం తీసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.

తమ డిమాండ్ పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore