Nellore: 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే!
Nellore: నెల్లూరు రూరల్ ముత్యాలపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ఇంటింటి పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర.
Nellore: 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, ముత్యాలపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లను ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పంపిణీ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు & శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసినా చెప్పిన మాటకు కట్టుబడి సంక్షేమ పధకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారని చెప్పారు.
ఇంత మంచి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనేత నారా లోకేష్ కి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరారు. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి, ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో విన్నూత్న కార్యక్రమాలు చేపట్టడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు..
జెన్-జి యువత ఆకాంక్షలు, మనోభావాలు తెలుసుకునేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్-జి యువతతో సమావేశాలు పెట్టారని చెప్పారు శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణా రెడ్డి, కాకు మురళి రెడ్డి, టీడీపీ నాయకులు జానా శివయ్య, డిష్ రమేష్, కాయల మధు, జల్లి కుమార్, కోరేం వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




