Gudur: గూడూరు పాత బస్టాండ్‌లో ఆటోల బెడద.. గందరగోళంగా ట్రాఫిక్!

Gudur: గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణం ఆటోల అడ్డాగా మారడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 29 Sept 2026 10:20 AM IST
Gudur
X

Gudur: గూడూరు పాత బస్టాండ్‌లో ఆటోల బెడద.. గందరగోళంగా ట్రాఫిక్!

Gudur: రోజురోజుకూ ఆటోల అడ్డాగా మారుతున్నాయి. బస్సులు రాకపోకలు సాగించే ప్రాంతంలోనే పెద్ద సంఖ్యలో ఆటోలు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు బస్టాండు ప్రాంగణం, ప్రధాన రహదారులపై ఆటోలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

బస్సుల సంఖ్య తగ్గుతుండగా ఆటోల సంఖ్య పెరగడంతో పాత బస్టాండు పరిస్థితి ఆటో స్టాండ్‌ను తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పి ఎస్ ర్ఆర్ టీ సి డియం దృష్టి మళ్లించి సిబ్బంది ఏర్పాటుచేసి పాత బస్టాండ్ అడ్డదిడ్డంగా ఉన్న ఆటోలను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.

అలాగే పోలీసు సిబ్బంది కూడా ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు పంపించి ఇక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేయవలసిందిగా ప్రయాణికులు కోరుతున్నారు ఎందుకంటే ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుందని వలన మీరు చర్యలు తీసుకోవాలి అని ప్రయాణికులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్