Kaligiri: మద్యం మత్తులో 85 ఏళ్ల వృద్ధుడిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు

Kaligiri: కలిగిరి మండలం నాగిరెడ్డిపాలెంలో దారుణం. మద్యం మత్తులో 85 ఏళ్ల వృద్ధుడిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు. పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగుబాటు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Aug 2026 7:51 AM IST
Kaligiri
X

Kaligiri: మద్యం మత్తులో 85 ఏళ్ల వృద్ధుడిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు

Kaligiri: నాగిరెడ్డిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన బక్కా సంజీవ్ కుమార్ (23) ఆదివారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న సమయంలో సంగన రామిరెడ్డి (85) ఇంటి ముందు ఉన్న మంచంపై పడుకున్నాడు. రామిరెడ్డి అతడిని లేపి ఇంటికి పంపించాడు. అరగంట తర్వాత సంజీవ్ కుమార్ తిరిగి వచ్చి అదే మంచంపై పడుకోవడంతో రామిరెడ్డి మరోసారి అతడిని మందలించి అక్కడి నుంచి పంపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సంజీవ్ కుమార్ ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి రామిరెడ్డి మెడపై పొడిచాడు. తీవ్ర గాయాలతో రామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం సంజీవ్ కుమార్ నేరుగా కలిగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story